హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీజేపీ మహిళా మోర్చా నిరసన

గద్వాల పట్టణంలోని వైఎస్సార్ చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సమతా మధు గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలపై వేధింపులకు పాల్పడేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.