హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభం

సంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి అంబేడ్కర్ భవన్తో పాటు జహీరాబాద్, జోగిపేట కేంద్రాల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ శిక్షణ ప్రారంభించారు. జనరల్ స్టడీస్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.