హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఢిల్లీలో సన్మానం అందుకోనున్న నడిగడ్డ రైతు

GDWL: అయిజ మండలానికి చెందిన ప్రగతిశీల రైతు ఉప్పల ప్రహ్లాద్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లారు. PMDDKY పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచిన ఆయనకు దక్కిన ఈ ఆహ్వానంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.