హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాగర్‌కర్నూల్‌కు జాతీయ అవార్డు'

NGKL: ప్రధానమంత్రి ధన్‌-ధాన్య కృషి యోజన (PMDKY) అమలులో నాగర్‌కర్నూల్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సోమవారం న్యూఢిల్లీలోని ఎన్‌ఎస్‌సీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డు అందుకున్నారు.