హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి మూడు దరఖాస్తులు: ఎంపీడీవో

NGKL: వంగూరు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మూడు దరఖాస్తులు అందాయని నోడల్ అధికారి, ఎంపీడీవో శారద తెలిపారు. భూ సమస్య పై ఒకటి, గ్రామపంచాయతీ అంశాలపై రెండు దరఖాస్తులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.