హైదరాబాద్: 28°C
తెలంగాణ

'టీచర్లు,ఆయాలకు నియామక పత్రాలు ఇవ్వాలి'

MLG: ప్రీ ప్రైమరీ పాఠశాలల కోసం ఎంపికైన 76 మంది టీచర్లు, ఆయాలకు వెంటనే నియామక పత్రాలు ఇచ్చి,పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం ములుగులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరారు. అనంతరం యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.