హైదరాబాద్: 28°C
తెలంగాణ

50 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు

SRD: 50 మంది లబ్ధిదారులకు రూ.13.30 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పంపిణీ చేశారు. ఇందులో సదాశివపేట మండలానికి చెందిన 28 మంది, పట్టణానికి చెందిన 22 మంది లబ్ధిదారులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్స పొందుతున్న పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.