హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

WNP: మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో SI, PC ప్రిలిమ్స్‌కు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ డిగ్రీ అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ లోపు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారి శ్రీనివాస్ తెలిపారు. డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.