హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయత్రి దేవి అలంకారంలో సంతోషిమాత

SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోషిమాత దేవాలయంలో నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. ఆలయంలో విశేష పూజలు, కుంకుమార్చనలు, చండీ రుద్ర హోమాలు నిర్వహించారు. బ్రాహ్మణ ముత్తైదువులకు సుహాసిని పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.