హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వల ప్రాజెక్ట్‌కు మరమ్మతులు కరువు

KNR: శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్ట్ మత్తడికి 2023 జూలై 28న గండి పడగా ఇప్పటికీ శాశ్వత మరమ్మతులు చేయలేదు. తాత్కాలిక రింగ్ బండ్ కూడా తెగిపోయి ప్రాజెక్ట్ ఖాళీ అయింది. శంకరపట్నం, వీణవంక మండలాల్లో 1,200 ఎకరాల పంటలు ఎండే ప్రమాదం ఉంది. దిగువ ఐదు చెక్‌డ్యాంలు ఎండిపోయాయి, మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. నిధులిచ్చి మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.