KMR: ముష్రీబ్‌బాగ్‌లో వృద్ధురాలు అనసూయ (66) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వివరించారు. ఇంట్లో పని చేసే పనిమనిషి రజిత, ఆమె భర్త నర్సింగ్ పథకం ప్రకారమే హత్య చేశారని తెలిపారు. వారి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ రజిత చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ
వృద్ధురాలిని హత్య చేసింది పనిమనిషే..!


