హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొడుకులకు భారం కాకూడదని తండ్రి ఆత్మహత్య

RR: కొడుకులకు భారం కాకూడదనే మనస్తాపంతో కేశంపేట్ మండలం నిర్దవెల్లికి చెందిన కమ్మరి పాండయ్య (59) నందిగామ రైల్వే బ్రిడ్జ్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మృతి చెందడం, తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతుండటంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.