హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం

MBNR: మిడ్జిల్ మండలం వాడియాల గ్రామానికి చెందిన నిరుపేద ఉమర్ కుటుంబానికి జరుపుల భాస్కర్ అండగా నిలిచారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబానికి రూ.10 వేల నగదు అందించారు. సొంతింటి నిర్మాణానికి రూ.లక్ష విలువైన సిమెంట్, పిల్లల చదువుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన సేవా దృక్పథంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.