హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటలకు కోయిల్ సాగర్ నీరు విడుదల చేయాలి

NRPT: వర్షాభావ పరిస్థితులతో మరికల్ మండలంలో పంటలు ఎండిపోతున్నాయని, చివరి తడి కోసం కోయిల్ సాగర్ నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో పృథ్వీరాజ్, తహసీల్దార్ రామకోటికి వినతిపత్రం సమర్పించారు. నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతయ్య, రాజావర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్, నరసింహులు పాల్గొన్నారు.