తెలంగాణ
పెబ్బేరులో సీపీఎం నిరసన
WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని సుభాష్ చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలో సీపీఎం జాతీయ నేత ఎంఏ బేబీ అరెస్టును ఖండించారు. ఎన్నికల సంఘం బీజేపీకి కొమ్ముకాస్తోందని నాయకులు మండిపడ్డారు. తక్షణమే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, తొలిగించిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించి ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


