హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: MLA

WGL: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం డిల్లీలో ఆయన మాట్లాడుతూ జ్ఞానేష్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు. కేంద్రం చెప్పినట్లు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని అన్నారు.