హైదరాబాద్: 28°C
వార్తలు

కలవలేను.. పిటిషన్ వేయండి: సీజేఐ

ఇండి కూటమి నిరసనలు, తనతో భేటీపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. 'నన్ను కలవాలని కోరుతూ విపక్షాల నుంచి నిన్న లేఖ అందింది. అయితే వారిని ఎందుకు కలవలేనో వివరిస్తూ రాత్రే బదులిచ్చాను' అని తెలిపారు. విపక్షాలు ప్రస్తావించిన అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని, దీనిపై పిటిషన్ వేయొచ్చని సూచించారు. సామాన్యుడైనా, నాయకులైనా.. అందరికీ సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయన్నారు.