ప్రధాని మోదీ టూర్ తర్వాత తమిళనాడులో రాజకీయ వివాదం చెలరేగింది. ప్రభుత్వ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌ను వేదికపై కూర్చోబెట్టడంపై టీవీకే అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధి కాని వ్యక్తికి ఏ ప్రోటోకాల్ ప్రకారం వేదికపై స్థానం కల్పించారని కేంద్రాన్ని నిలదీసింది. ఇటువంటి విధానాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్వస్తి పలకాలని టీవీకే నేతలు డిమాండ్ చేశారు.
వార్తలు
మోదీ టూర్.. తమిళనాట పొలిటికల్ హీట్


