హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల

BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్టలో నిర్వహించిన గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.