హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ,రేపు నీటి సరఫరా బంద్

SRD: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం,మంగళవారం మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోనుంది. పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ విజయలక్ష్మి తెలిపారు. మునిపల్లి, కోహీర్, ఝరాసంగం, జహీరాబాద్, పటాన్‌చెరు ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.