MHBD: డోర్నకల్ మండలం జోగ్యాతండాలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి 30 లీటర్ల నాటుసారా, ఐదు కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. 600 లీటర్ల నాటుసారా పానకాన్ని ధ్వంసం చేసి, ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ చంద్రమౌళి తెలిపారు. అనంతరం గుడుంబా వల్ల కలిగే అనర్థాలపై తండా యువతకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
నాటుసారా పట్టివేత.. ఆరుగురిపై కేసులు


