హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి అలంకరణకు బంగారు ఆభరణాలు

MLG: ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురంలో శ్రీ హనుమాన్ సత్సంగ్ కమిటీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం గ్రామానికి చెందిన బందేల స్వాతి రాము దంపతులు అమ్మవారికి బంగారు పుస్తెలు, వెండి మట్టలను కానుకగా సమర్పించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన వీటిని అమ్మవారి అలంకరణ కోసం అందజేశారు.