హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

 BPT: వేమూరులోని పద్మావతి కల్యాణ మండపంలో మంగళవారం ఉదయం 9 గంటలకు టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ఆనందబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజశేఖరబాబు పాల్గొంటారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు వేశానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.