కోనసీమ: కరెంట్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పి.గన్నవరం మండలం మానేపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మట్టపర్తి బాలకృష్ణ (38) టెంటు హౌస్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్
మానేపల్లిలో విషాదం.. కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి


