కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇందులో భాగంగా ఆదోని తాలూకా సీఐ నల్లప్ప రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్


