హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముమ్మరంగా వాహనాల తనిఖీలు

PLD: చిలకలూరిపేట నరసరావుపేట సెంటర్‌లో ఆదివారం రాత్రి అర్బన్ సీఐ పి. రమేష్ ఆదేశాలతో ఎస్సై సోమేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేనివారికి, సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. నిబంధనలు పాటించాలని, మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.