హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకుడు మృతి

WGL: పర్వతగిరి మండలానికి చెందిన సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకుడు పుల్లూరి దిలీప్ సోమవారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ కన్వీనర్‌గా దిలీప్ సేవలందించారు. ఆయన మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. దిలీప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.