ప్రకాశం: ఒంగోలులో సోమవారం నిర్వహించనున్న MRPS చలో కలెక్టరేట్ మహా ధర్నాకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఆదివారం రాత్రి ప్రెస్-మీట్ నిర్వహించారు. తౌశిక్, అతని తల్లి మృతికి సంబంధించిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరుగుతోందన్నారు. ధర్నాకు అనుమతి లేదని, ప్రజా సంఘాలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహాధర్నాకు అనుమతి లేదు: ఎస్పీ


