హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెస్ పోటీల్లో నరసరావుపేట విద్యార్థినికి నాలుగో స్థానం

PLD: మోతడకలో అక్టోబర్ 10న నిర్వహించిన అఖిల భారత స్థాయి ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీల్లో కే-రిడ్జ్ స్కూల్ విద్యార్థిని సత్య వ్యాహృతి కొల్లిపర నాలుగో స్థానం సాధించింది. అండర్‌-11 బాలికల విభాగంలో ఏడు రౌండ్లు ఆడి నాలుగు గేమ్‌లలో విజయం సాధించింది. కోనేరు హంపి, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ చేతుల మీదుగా ట్రోఫీ అందుకుంది. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు అభినందించారు.