హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాతపాడులో కోడిపందేల శిబిరంపై దాడి

WG: మొగల్తూరు మండలంలోని పాతపాడు గ్రామంలో ఆదివారం కోడిపందేల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై జి. వాసు తెలిపారు. వారి నుంచి కత్తులు కట్టిన రెండు కోడి పుంజులు, నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.