హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే దంపతులకు ఘనంగా సన్మానం

NDL: ఆళ్లగడ్డ పట్టణంలో దసరా పండుగ సందర్భంగా దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు వారు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాజీ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు.