CTR: ఓపెన్ స్కూలు దరఖాస్తు గడువును పెంపొందించినట్టు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్‌లో చేరడానికి ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 31వ తేదీలోపు అడ్మిషన్లు పొందవచ్చన్నారు. చదువు మధ్యలో మానేసిన వారు, ఉన్నత చదువులు కొనసాగించాలన్న ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఓపెన్ స్కూల్లో దరఖాస్తు గడువు పెంపు'


