హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైకులతో విన్యాసాలు.. ముగ్గురిపై కేసు

HNK: హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌ వద్ద ఎన్‌హెచ్‌-563 ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై బైకులతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌ ఆదివారం తెలిపారు. కళాశాల కార్యక్రమం అనంతరం యువకులు అతివేగంగా బైకులు నడుపుతూ ప్రయాణికులను భయాందోళనకు గురిచేశారు.రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.