హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. ముగ్గురిపై కేసు

VZM: వంగర ఎస్సై షేక్ శంకర్ ఆదివారం రాత్రి స్థానిక రుషింగి వంతెన వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు మద్యం తాగి బైకులు నడుపుతూ పట్టుబడ్డ ముగ్గురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమావళి పాటించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.