హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేనెటీగల దాడిలో ఒకరు మృతి

తూ.గో: సీతానగరం మండలం ఇనగంటి వారిపేట లంక ప్రాంతంలో తేనెటీగల దాడిలో రైతు భీమరాజు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఆదివారం పొలంలో ఆయిల్ ఇంజిన్ రిపేరు చేస్తుండగా ఈ దాడి జరిగింది. శ్రీరామనగరానికి చెందిన వేపుగంటి భీమరాజు ప్రాణాలు కోల్పోగా, గాయపడిన నలుగురిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. సీతానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.