హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NTR: విజయవాడ చుట్టుగుంట సబ్‌స్టేషన్‌ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని ఈఈ ఆర్‌.రవికిషోర్‌ తెలిపారు. విద్యుత్‌ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో ఏలూరు రోడ్డులోని దాసరి వారి వీధి, కోవెలమూడి వారి వీధి, వెంకటకృష్ణయ్య వీధి, శ్యామలాదేవి రోడ్‌తో పాటు మరో 9 వీధుల్లో సరఫరా ఉండదన్నారు.