హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొలాల్లోకి ఎవరూ ఒంటరిగా వెళ్లవద్దు: పోలీసులు హెచ్చరిక

తూ.గో: గౌరీపట్నం, ఐ.పంగిడి ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి చాగల్లు వైపు రావచ్చని పోలీసులు ఆదివారం ప్రజలను హెచ్చరించారు. రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని వారు సూచించారు. పులి కదలికలపై జాగ్రత్తగా ఉండాలని DyCM పవన్ కళ్యాణ్ సూచించడంతో అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా మరింత నిఘా పెంచారు. సంబంధిత గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.