KRNL: దేవనకొండ(M) గుండ్లకొండలో నవవధువు అరుణ (20) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తుగ్గలి(M) లింగనాయదొడ్డికి చెందిన ఆమెకు వెంకటేష్‌తో 41 రోజుల క్రితమే వివాహమైంది.రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసిన అరుణ నిన్న తెల్లవారుజామున విగతజీవిగా కనిపించింది.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పెళ్లైన 41 రోజులకే వివాహిత మృతి!


