VZM: పొట్టకూటి కోసం వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన మహిళ పాము కాటుకు గురై ఆదివారం మృతి చెందారు. ఎస్.సీతారాంపురానికి చెందిన తెలుగు గంగమ్మ(48) పత్తి ఏరివేత పనికి వెళ్లగా నాగుపాము కాటు వేసింది. బాడంగి సీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలికి భర్త అచ్చియ్య, కుమార్తె లక్ష్మి ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాము కాటుతో మహిళ మృతి


