హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఈ గ్రామాలలో విద్యుత్‌కి అంతరాయం

కోనసీమ: నగరం, మగటపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం సరఫరా నిలిపివేస్తున్నట్లు కొత్తపేట ఈఈ రాంబాబు తెలిపారు. మగటపల్లి పరిధిలోని 6 గ్రామాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు పవర్ కట్ ఉంటుందన్నారు. నగరం పరిధిలోని మొగలికుదురులో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కరెంట్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.