హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

తూ.గో: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను ఇవాళ బొమ్మూరు కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మున్సిపల్, మండల స్థాయిల్లో నిర్వహిస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు కార్యాలయాల్లో నేరుగా లేదా 1100 టోల్ ఫ్రీ నంబర్, వెబ్‌‌సైట్ ద్వారా అర్జీలు ఇవ్వవచ్చన్నారు. పరిష్కారంపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలియజేయాలని పేర్కొన్నారు.