RR: అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారులు నిఘా ముమ్మరం చేశారు. బెంగళూరు హైవేపై రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించి 60 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్, మీర్‌పేట్ ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న బాటిళ్లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
తెలంగాణ
ఎయిర్‌పోర్టు సమీపంలో మద్యం బాటిళ్లు సీజ్!


