హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జేసీబీతో దారి క్లియర్.. వాహనదారుల హర్షం!

BPT: చీరాల మండలం రామకృష్ణాపురం నుంచి లక్ష్మీపురం వెళ్లే రహదారికి ఇరువైపులా దట్టంగా పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లను అధికారులు శుభ్రం చేయించారు. ముళ్ల పొదల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చేసిన ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించారు. జేసీబీతో దారిని క్లియర్ చేయించడంతో వాహనదారులు, పాదచారులు హర్షం వ్యక్తం చేశారు.