హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యావతారంలో స్వామివారి దర్శనం

సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో దశరా శరన్నవరాత్రి అలంకార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఖాద్రీ నృసింహ స్వామివారు మత్స్యావతార అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమన్నారాయణుడు వేదాలను రక్షించేందుకు మత్స్యావతారం దాల్చాడని, ఈ ఉత్సవాల్లో స్వామివారి అవతారాలను దర్శించుకోవాలని అర్చకులు తెలిపారు.