VSP: కేబీఆర్ నీటిశుద్ధి ప్లాంటులో మరమ్మతుల కారణంగా ఇవాళ 72, 73, 74, 76 వార్డుల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు సరఫరాలో ఇబ్బందులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నీటి సరఫరాకు అంతరాయం


