హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KRNL: కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో జాతీయ ఆహార నూనెగింజల పథకం కింద ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రైతులకు ఉచిత వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. సాగు ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం 50 శాతం రాయితీపై పురుగుమందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ దస్తగిరి రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవి పాల్గొన్నారు.