హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

TPT: రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామ నగర్లో పెయ్యాల బద్రి (26) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. ఆటో నడుపుతూ జీవించే బద్రి మద్యానికి బానిసై అప్పులపాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.