హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొయ్యూరులో గరగల ఊరేగింపు

ASR: కొయ్యూరులో శరన్నవరాత్రుల సందర్భంగా నిన్న ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దుర్గామాత ఆలయ కమిటీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ ఇంటి నుంచి సంప్రదాయబద్ధంగా గరగల ఊరేగింపును ప్రారంభించారు. భవానీలు, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని జయజయధ్వానాల మధ్య ఆలయం వరకు ఊరేగింపుగా సాగారు. అమ్మవారికి మొక్కులు సమర్పించి ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.