హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లర్లకు పాల్పడితే చర్యలు: సీఐ

NTR: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎవరూ అల్లర్లకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని పటమట సీఐ పవన్ కిషోర్ హెచ్చరించారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో పలువురికి ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, ఎలాంటి గొడవలకు దిగకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అల్లర్లకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.