SKLM: పొందూరు మండలం బురిడికంచరాం గ్రామానికి చెందిన మీసాల రాజశేఖర్ (20) రోడ్డు ప్రమాదంలో నిన్న మృతి చెందాడు. ఆమదాలవలసలో సీఆర్పీఎఫ్ జవాన్ అయిన సోదరుడిని రైలు ఎక్కించి, పుట్టినరోజు కావడంతో స్నేహితురాలితో కలిసి ద్విచక్ర వాహనంపై కళింగపట్నం వెళ్తుండగా గార మండలం సీఎస్పీ రహదారిలో ఉప్పరపేట మలుపు వద్ద కారును ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై మార్గమధ్యలో చనిపోయాడు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం


